Balanagar Traffic Police - హైదరాబాద్లోని బాలానగర్లో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి మృ*తి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా బైకును ఆపే క్రమంలో ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే అతని తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృ*తి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని వాహనదారులు ఆందోళన చేశారు. వాహనదారుల ఆందోళనలతో మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా రాకపోకలు స్తంభించాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదానికి దిగిన వాహనదారులను పోలీసులు చెదరగొట్టారు.
A man tragically lost life in Balanagar, Hyderabad, after falling under an RTC bus during a traffic check. He lost control of his bike while stopping for police, and the bus ran over him. Locals blamed police negligence, sparking protests and a 3 km traffic jam from Jeedimetla to Balanagar. Tensions rose as commuters clashed with police.
#Hyderabad #Balanagar #TrafficPoliceNegligence #BalanagarTrafficPolice #BalanagarProtest #RoadSafetyIndia
Also Read
రంగంలోకి బండి సంజయ్.. రాజా సింగ్ యూటర్న్! :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-mlc-elections-bandi-sanjay-meets-raja-singh-432407.html?ref=DMDesc
తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు! కానీ, ఎండలు మాత్రం తగ్గేదేలే :: https://telugu.oneindia.com/news/telangana/rains-to-continue-for-another-three-days-in-telangana-432395.html?ref=DMDesc
విజయశాంతి దంపతులకు బెదిరింపు మెసేజ్‌లు :: https://telugu.oneindia.com/news/telangana/threatening-messages-to-congress-mlc-vijayashanti-couple-432357.html?ref=DMDesc